ప్రకాశం జిల్లా పామూరు మండలంలో గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.