కనిగిరి పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండు పూల కొట్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.