వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి సభ్యులు గుంటక తిరపతి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అవసరమన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.