ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్లలో మతిస్థిమితం లేని వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. అంకాలమ్మ గుడిలోకి ప్రవేశిస్తున్న క్రమంలో దొంగగా భావించిన గ్రామస్తులు ఆ వ్యక్తిని పట్టుకుని గుంజకు కట్టేశారు. తర్వాత పోలీసులు విచారించగా అతని పేరు వంశీ అని మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించారు. తర్వాత విచారించి మతిస్థిమితం లేని వ్యక్తిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.