ఫిబ్రవరి 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయస్థాయిలో జరిగే సార్వత్రిక సమ్మెలో కొండేపి ప్రాజెక్ట్లోని అంగన్వాడీ సిబ్బంది పాల్గొంటున్నారని ప్రకాశం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు సత్యవతి తెలిపారు. ఈ నేపథ్యంలో, కొండపిలో సీడీపీవో సుశీల దేవికి సమ్మె నోటీసును అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.