మాజీ సర్పంచ్ పై దాడి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ప్రస్తుత జనసేన నాయకుడు నాగరాజుపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక లావాదేవీల విషయంలో సోమవారం దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన నాగరాజు కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండపి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ మనోజ్ కుమార్ కార్యకర్తలతో కలిసి నాగరాజును పరామర్శించి, దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్