బస్సు లోపలికి రావాలని పిలిచినందుకు దాడి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో శనివారం బస్సు కండక్టర్ పై యువకుడు దాడికి పాల్పడ్డాడు. బస్సు డోర్ వద్ద నిల్చున్న యువకుడిని లోపలికి రావాలని కండక్టర్ మందలించడంతో ఆగ్రహించిన యువకుడు ఈ దాడి చేసినట్లు సమాచారం. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్