ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం, కొత్తపాలెంలో రాములవారి ధ్వజస్తంభం బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆదివారం రాత్రి కుంకుమార్చన, రామాయణ పారాయణం నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలతో కార్యక్రమాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టా కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.