సైబర్ మోసంతో ఖాతా నుంచి నగదు మాయం

సింగరాయకొండ పాకాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్, సైబర్ నేరగాళ్ల వలలో పడి తన ఖాతా నుంచి రూ. 7.45 లక్షలు కోల్పోయాడు. గత నెల 28వ తేదీన సునీల్ మొబైల్ ఫోన్‌కు ఒక నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత తన ఖాతా నుంచి నగదు మాయం కావడంతో అప్రమత్తమైన సునీల్, బ్యాంక్ అధికారులకు సమాచారం అందించి మిగిలిన రూ. 2.65 లక్షలను కాపాడుకోగలిగాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్