రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్