సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో బుధవారం మంత్రి స్వామి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 47 మందికి రూ. 55 లక్షల విలువైన చెక్కులను అందించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 1687 మందికి రూ. 13 కోట్లకు పైగా విలువైన చెక్కులు అందించామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్