ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో ప్రతినెల 1వ తేదీ కల్లా పెన్షన్ దారులకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. సోమవారం టంగుటూరు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే కూటమి ప్రభుత్వం తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారని తెలిపారు.