ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు, వృద్ధులు, వితంతువులు, మరియు అన్ని వర్గాల వారికి ప్రతి నెలా ఒకటవ తేదీన అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మర్రిపూడి మండల కేంద్రంలో బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల.శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యగారి ఆదేశాల మేరకు, మర్రిపూడి గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలగిరి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్య కమిటీ చైర్మన్ ఉప్పు సాయిబాబు, 20వ బూత్ కన్వీనర్ కొణిదెన మోహన్ రావు, స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి ఈ పింఛన్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్