అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడు పంచాయతీ మాజీ సర్పంచ్ బాలినేని సుబ్బారెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి పై పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు. కొండపి వైసిపి నేత మాదాసి వెంకయ్యతో పాటు పలువురు వైసిపి నాయకులు మాజీ సర్పంచ్ కు పూలమాలవేసి నివాళులు అర్పించారు. బాలినేని సుబ్బారెడ్డి అంత్యక్రియలు రేపు గురువారం కొణిజేడు లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్