కూచిపూడిలో ఉచిత పశు వైద్య శిబిరం

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపూడిలో కొండపి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశు వైద్య శిబిరంలో చైర్మన్ కర్ణ తిరుపతమ్మ శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశువులకు ఉచిత టీకాలు వేశారు. గొర్రెలకు సీజనల్ వ్యాధులు రాకుండా మందులు పంపిణీ చేశారు. రాయితీపై పశువుల మేత కోసం జొన్నల బ్యాగులను గ్రామస్తులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్