ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సుబ్బరామిరెడ్డి కాలనీలో సోమవారం ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. శ్యామల అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.