పదో తరగతి ఫలితాల్లో అంబేడ్కర్ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని మంత్రి స్వామి కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 13,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 12,115 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీచర్లను, విద్యార్థులను అభినందించారు.