మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ శుక్రవారం కొండపిలో మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయన భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.