ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్ లో బుధవారం సీఐ సోమశేఖర్ క్రైమ్ రిపోర్ట్ ను పరిశీలించారు. ఇటీవల జరిగిన నేరాల వివరాలను ఎస్సైలు, సిబ్బందితో చర్చించి, నేరస్థులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అత్యధికంగా నేరాలు జరుగుతున్న గ్రామ పరిసరాల మ్యాపులను కూడా సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు సీఐ తెలిపారు.