గురుకుల ప్రవేశాలకు ఆహ్వానం

ప్రకాశం జిల్లా సింగరాయకొండ డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రిన్సిపాల్ కె. రమాదేవి బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 5వ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు 6-10 తరగతులలో బ్యాక్లాగ్ సీట్లు, జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయి. ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 19 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 5వ తరగతి, ఇంటర్ జనరల్, ఐఐటీ & నీట్ కోచింగ్ గ్రూపులకు మార్చి 1న పరీక్షలు జరుగుతాయి. 6, 7 తరగతులకు మార్చి 2న ఉదయం 10 గంటలకు, 8, 9, 10 తరగతుల సీట్లకు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్