ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో కార్తీక శోభ నెలకొంది. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని పాకాల సముద్ర తీరంలో భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి, సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మహిళా భక్తులు సముద్రతీరంలో శివలింగాలు చేసి శివుడికి పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్థానిక మెరైన్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.