ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరు-తాటాకులపాలెం మధ్య పొదిలి రోడ్డులో గురువారం కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పొదిలి నుంచి స్వగ్రామమైన తాటాకుల పాలెం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గల కారణాలపై భిన్న కథనాలు చెబుతున్నారు. బైకును తప్పించబోయి ప్రమాదం జరిగిందని కొందరు, పొలంలో నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో మరికొందరు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.