కొండపి: ఆశాజనకంగా పొగాకు కొనుగోళ్లు

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో సోమవారం జరిగిన పొగాకు కొనుగోళ్లు ఆశాజనకంగా జరిగాయని అధికారులు వెల్లడించారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో 797 పొగాకు బేళ్లు కొనుగోలు చేయగా టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో 679 పొగాకు బేళ్లు కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 513 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయని కనిష్ట ధర రూ. 160 కాగా గరిష్ట ధర రూ. 280 పలికిందని వేలం నిర్వహణ అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్