కొండేపిలో శుక్రవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే బాహుబలి సినిమా గుర్తొస్తుందన్నారు. సీఎం కుర్చీలో చంద్రబాబు ఉన్నా, ప్రజల గుండెల్లో మాత్రం జగన్ ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పాలన లేదని వైసీపీ పాలన లానే ఉందని అన్నారు.