ఏడాది కావొచ్చినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీశ్ రెడ్డి విమర్శించారు. కొండేపిలో జరిగిన 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.13 వేలే ఇచ్చారని ఆరోపించారు. కొత్త పింఛన్ ఒక్కటి ఇచ్చినట్లు నిరూపించినా తాను చంద్రబాబు కాళ్లకు నమస్కారం చేస్తానన్నారు.