ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నందనవనంలో సోమవారం లైన్మెన్ ప్రసాద్ కు విద్యుత్ షాక్ తగిలింది. దావగూడూరు ఫీడర్ అనుకుని నందనవనం ఫీడర్పై లైన్ వర్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భుజం, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ నందనవనం ఇన్ఛార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.