టంగుటూరులో భారీ అగ్ని ప్రమాదం

టంగుటూరులోని సింగరాయకొండ రోడ్డులో ఉన్న బెల్లం కోటయ్య పొగాకు గోడౌన్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో నిల్వ ఉంచిన కోట్ల రూపాయల విలువైన పొగాకు బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఒంగోలు డి.ఎస్.పి, సింగరాయకొండ, టంగుటూరు ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్