ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అక్రమంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న కొండయ్యకు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 3వేల జరిమానా విధించింది. 2024లో సోమరాజుపల్లికి చెందిన కొండయ్య సింగరాయకొండలో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. అప్పటినుండి విచారణ చేపట్టిన కోర్టు ఈ శిక్ష విధించింది. అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.