ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట గ్రామంలో శుక్రవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే స్వామి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోరాదని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.