పొదిలి ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసిన మంత్రి

ప్రకాశం జిల్లా పొదిలి ఎస్సీ హాస్టల్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని అధికారులు విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులు నివసిస్తున్న ప్రాంగణాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మంత్రి స్వామి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్