ప్రకాశం జిల్లా కొండపి ఎంపీడీవో రామాంజనేయులు బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం గురించి వివరించారు. చోడవరం, ఉప్పలపాడు పంచాయతీల్లో స్వచ్ఛపదం పనులను పరిశీలించారు. పల్లెలు, రహదారులను చెత్తరహితంగా మార్చడానికి ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ప్రతివారం బుధవారం గ్రామాలు, రహదారుల ఇరువైపులా చెత్తకుప్పలు, పేడదిబ్బలు శుభ్రం చేయడం ద్వారా ప్రజా రాజ్యాన్ని పెంచే ప్రజా ఉద్యమమే స్వచ్ఛపదం అని ఆయన పేర్కొన్నారు.