డివైడర్ కు మరమ్మతులు చేసిన అధికారులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పది రోజుల క్రితం నిర్మాణం పూర్తయిన డివైడర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అధికారులు ధ్వంసమైన డివైడర్‌కు మరమ్మత్తులు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్