రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మినీ లారీ టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మినీ లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్