ప్రకాశం జిల్లా జరుగుమల్లి ఫ్లై ఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ ద్వారా క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.