ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో శుక్రవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంటరి మహిళ పెన్షన్లను పంపిణీ చేశారు. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళలను గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళల పెన్షన్లు అందజేస్తుందని మంత్రి స్వామి అన్నారు.