కొండేపి నియోజకవర్గంలో జనసేన ఇన్ ఛార్జ్ ఎవరూ లేరని సింగరాయకొండ జనసేన కార్యకర్త మనోజ్ రాయల్ చేసిన వ్యాఖ్యలను జరుగుమల్లి మండల జనసేన అధ్యక్షుడు శశి భూషణ్ ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, జనసేన కేంద్ర కార్యాలయం లేదా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ నుంచి కొండేపి ఇన్ ఛార్జ్ లేరని అధికారికంగా ప్రకటించలేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.