ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు గురువారం 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పించింది. 2019వ సంవత్సరంలో ఏడు సంవత్సరాల మైనర్ బాలికను మిద్దె మీదకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షాదారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పలుమార్లు విచారణ జరిపి నిందితుడికి జైలు శిక్ష రూ. 10 వేలు జరిమానా విధించింది.