ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ మరియు సింగరాయకొండ పరిధిలోని సముద్రతీరంలో భక్తులు బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచి, ప్రజలను సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేశారు.