సింగరాయకొండ మండలంలోని చైతన్య పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై కలెక్టర్ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. పాఠశాలలో అనేక లోపాలను గుర్తించిన కమిటీ నివేదికను డీఈవో రేణుకకు అందజేసింది. డీఈవో పాఠశాల యాజమాన్యానికి మంగళవారం షోకాజ్ నోటీసు జారీచేస్తూ, 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు.