ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా తరలివచ్చారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని మెరైన్ పోలీసులు సముద్రపు తీరంలో జలకలాడుతున్న ప్రజలను మరింత లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు పడ్డారు. ఎప్పటికప్పుడు లోపలికి వెళ్లే వారిని హెచ్చరిస్తూ సురక్షితంగా ఒడ్డు ప్రాంతంలోనే గడపాలని పోలీసులు హెచ్చరించారు.