సింగరాయకొండ: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిఐ హజరతయ్యా

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ సీఐ హజరతయ్యా ఏపీ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో సిఐని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన హజరతయ్యాను పలువురు పోలీసు సిబ్బంది అభినందించారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని సీఐ హజరతయ్యా అన్నారు.

సంబంధిత పోస్ట్