సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామానికి చెందిన జాలమ్మ అనే మైనర్ బాలిక గత నెల 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంటిలో నుంచి బాలిక వెళ్ళిపోయినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరన్నా ఫోటోలో ఉన్న బాలికను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.