సింగరాయకొండ కలికివాయికి చెందిన ఓ మహిళ గురువారం ఎస్సై తిట్టాడంటూ ఎలకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. మద్యం తాగి వచ్చి ఓ వ్యక్తి తనపై దాడి చేయగా ఆ విషయంపై ఎస్ఐకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని ఆ సమయంలో ఎస్ఐ తనను అవమానించాడం బాధిత మహిళ ఆరోపిస్తుంది. మహిళను ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. వికలాంగురాలు అని చూడకుండా ఎస్సై తిట్టడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.