సింగరాయకొండ: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన జరిగింది. రైల్వే సిబ్బందికి ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియలేదని గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కందుకూరు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్