నీలకంఠ మూవీలో నటించిన సింగరాయకొండవాసి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కరేడు గ్రామానికి చెందిన యువకుడు అనిల్, 'నీలకంఠ' అనే సినిమాలో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, స్థానిక ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అనిల్‌ను అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనిల్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్