సాంఘిక సంక్షేమశాఖ గురుకుల వసతి గృహాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి స్వామి శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డులు, నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్య ద్వారానే పేదరికాన్ని జయించవచ్చని, గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. లోకేశ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తుచేశారు.