టంగుటూరు: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి మంత్రి స్వామి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్