ప్రకాశం జిల్లా టంగుటూరు లో గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పర్యటించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్త నీరజ్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబానికి సానుభూతి తెలుపుతూ పరామర్శించారు. నీరజ్ చనిపోయిన విషయాన్ని ఆరాతీసి తెలుసుకున్నారు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడాని ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.