ప్రకాశం జిల్లా టంగుటూరులో వాహనదారులకు, శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్సై నాగమల్లేశ్వరరావు, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్, బండికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మోటార్ సైకిల్ కి సైలెన్సర్లు మారిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించవద్దని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.