పూడ్చిన శవాలను ట్రాక్టర్లతో దున్నారు'

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో ఎస్టీల స్మశాన భూమిని చాంద్ బాషా కబ్జా చేశాడని ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 105/2లో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి, రెండు రోజుల క్రితం శ్మశానంలో పూడ్చిన మృతదేహాలను ట్రాక్టర్లతో దున్ని, చదును చేశాడని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్